Sunday, May 19, 2024

‘భవిష్యత్ తరాలు మనల్ని క్షమించకపోవచ్చు’.. హెచ్చరించిన WHO చీఫ్..!!

spot_img

కోవిడ్ మహమ్మారి నుంచి ప్రపంచం కోలుకున్నప్పటికీ…భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని మహమ్మారులను చూడాల్సిన ప్రమాదం ఉందని అంతర్జాతీయ వైద్య నిపుణులు హెచ్చరిస్తోన్న సంగతి తెలిసిందే. అలాంటివి సంభవిస్తే..ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సూచించింది. భవిష్యత్తు మహమ్మారులపై సంసిద్ధతకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ప్రపంచ దేశాల నిర్లక్ష్య ధోరణిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేశారు. అది విఫలమైతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించకపోవచ్చు అని హెచ్చరించింది.

ప్రపంచ దేశాల నిబద్ధతకు అనుగుణంగా వ్యవహరించడం లేదని ఆందోళన చెందుతున్నా…సమయం తక్కువ ఉందన్నారు. పరిష్కరించుకోవల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ ఒప్పందం చేసుకోవడంలో విఫమైతే ఒక అవకాశాన్ని కోల్పోయినట్లే. భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించకపోవచ్చు. ఒఫ్పందానికి చాలా ధైర్యం కావాలి. రాజీ పడాలి. దీనిపై ఏకభిప్రాయం సాధించేందుకు సభ్యదేశాలు ప్రయత్నాలు చేయాలని డబ్ల్యూహెచ్ ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ అన్నారు.

జెనీవాలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది మే నాటికి మహమ్మారి ఒప్పందానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రపంచ నేతలు అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తించారు. టెడ్రోస్ జనవరి 30, 2020న కోవిడ్-19ని అంతర్జాతీయ ఆందోళనతో కూడిన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.కానీ మార్చి 2020 వరకు అతను అధ్వాన్నంగా ఉన్న పరిస్థితిని మహమ్మారిగా పేర్కొన్నాడు. చర్చల్లో 300 సవరణలు ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ లో భారీ పేలుడు!

Latest News

More Articles