Monday, May 20, 2024

ఇంటింటి నుంచి చెత్త సేకరణ సమర్థవంతంగా నిర్వహించాలి

spot_img

హైదరాబాద్ నగరంలో గార్బేజ్ వల్బారెబుల్ పాయింట్ ఎత్తివేసి ప్రాథమిక దశలో చేపట్టే ఇంటింటి నుండి చెత్త సేకరణ సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్. ఇవాళ (శుక్రవారం) కమిషనర్ మాదాపూర్, అయ్యప్ప నగర్ లో జివిపి తొలగించిన ప్రదేశాలను అధికారులతో కలిసి పరిశీలించారు కమిషనర్ రోనాల్డ్ రోస్. ఈ సందర్భంగా ఎత్తివేసిన జివిపి గురించి కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. ఎత్తివేయడంతో ఎలాంటి సమస్య లేదని ఇంటింటికీ స్వచ్ఛ ఆటో రోజు వారీగా సేకరణకు వస్తుందన్నారు. జివిపి అవసరం లేదని కాలనీ వాసులు కమిషనర్ కు వివరించారు.

ఆ తర్వాత కమిషనర్ పర్వతపూర్ కాలనీ వెళ్లి జివిపి పరిశీలన చేస్తుండగా కాలనీ వాసులు చెత్త పట్టుకొని రావడంతో ఎస్ ఎఫ్ ఏ పై ఆగ్రహం వ్యక్తం చేశారు రోనాల్డ్ రోస్. దీనికి గల కారణాలు అక్కడికి వచ్చిన కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం డ్యూటీకి వెళ్లడంతో స్వచ్ఛ ఆటో రోజు వారీగా రాక పోవడంతో.. జివిపి దగ్గరకు వచ్చి చెత్తను వేస్తున్నట్లు కమిషనర్ కు వివరించారు. దీంతో ఎస్ఎఫ్ఏ  పై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ రోనాల్డ్ రోస్.. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న జోనల్ కమిషనర్, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ లకు ఆదేశించారు. అక్కడి నుంరి జూబ్లీహిల్స్ లో నిర్వహిస్తున్న గోశాలను సందర్శించి శానిటేషన్ కు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు కమిషనర్.

Latest News

More Articles