Sunday, May 19, 2024

ఎన్నికల విధుల్లో సొంత నిర్ణయాలు వద్దు.. తప్పు చేస్తే కఠిన చర్యలు

spot_img

ఎన్నికల నిర్వహణలో సొంత నిర్ణయాలతో కాకుండా ఎన్నికల నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఎన్నికల విధులు నిర్వహించే ఆర్.ఓ లు, స్పెషల్ అధికారులు, నియోజక వర్గ స్థాయి ట్రైనింగ్ అధికారులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

Read Also: సినీప్రియులకు బంపర్ ఆఫ‌ర్.. రూ.700ల‌కే 10 సినిమాలు

ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జి హెచ్ ఏం సి కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు. ప్రతి అంశానికి ఎన్నికల కమిషన్ స్టాండర్డ్ ఆఫ్ ప్రిసెడర్స్ (sop) రూపొందించినట్లు తెలిపారు. ఎప్పుడు గానీ ఇతరులు మీ క్రింది స్థాయి అధికారి చెప్పిన మాటలు గానీ సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఎన్నికల నియమావళి నిబంధనలు పాటించలన్నారు.

ఎన్నికల్లో ముఖ్యంగా నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ ముఖ్యమని అన్నారు. ఈ అంశంలో ఏ ఒక్కరూ చిన్న తప్పుచేసినా జిల్లాకు చెడ్డ పేరు వర్తిస్తుందన్నారు. ఇందులో తప్పుచేసిన వారిని ఎవ్వరినీ క్షమించరని తెలిపారు. తనకు దగ్గర అనుకూలమైన అధికారి అని చూడరని అన్నారు. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికల విషయంలో ఇతర జిల్లాలో కొన్ని సంఘటనలు జరిగినాయి. అందుకు ఎన్నికల నిబంధనలు పాటించక పోవడమే కారణం. చిన్న చిన్న విషయాల వల్ల పొరపాట్లు జరిగాయని, ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ సందర్భంగా పి.ఓ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. విధులను సక్రమంగా నిర్వర్తించేందుకు ట్రైనింగ్ ఉపయోగపడుతుందని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు.

Read Also: దిల్ రాజు అల్లుడి కారు చోరీ.. కేటీఆర్ కారు అనుకున్నానన్న దొంగ

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ స్నేహ శభరిష్, హైదరాబాద్ జిల్లా కలెక్టరు అనుదీప్, కంటోన్మెంట్ సిఇఓ మధుకర్ నాయక్, అడిషనల్ కమిషనర్లు శంకరయ్య, శ్రీవత్స, ఖైరతబాద్ జోనల్ కమిషర్ వెంకటేష్ దొత్రే, జీహెచ్ఎంసీ ఆయా విభాగాల అధికారులు డాక్టర్ పద్మజ, చంద్రకాంత్ రెడ్డి, భాషా, ట్రైనింగ్ నోడల్ అధికారి వెంకట్ రెడ్డి, సౌజన్య, డీఆర్ఓ వెంకటా చారి, సికింద్రాబాద్ ఆర్డీఓ రవి, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్ఓలు, తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles