Sunday, May 19, 2024

ట్యాంక్‌బండ్‌‎పై ఆంక్షలు.. అతిక్రమిస్తే జరిమానాలు

spot_img

హైదరాబాద్‎లో ట్యాంక్‌బండ్‌ ఎంత ఫేమసో చెప్పక్కర్లేదు. చాలామంది ట్యాంక్‌బండ్‌ మీద వివిధ రకాల సెలబ్రేషన్లు జరుపుకుంటారు. అందులో భాగంగా కేక్‎లు కట్ చేస్తూ, సెల్ఫీలు దిగుతూ స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వారి ఎంజాయ్‎మెంట్‎కు జీహెచ్ఎంసీ అడ్డుకట్ట వేసింది. ట్యాంక్‌బండ్‌ మీద కేక్ కటింగ్ చేయడం వల్ల వాహనదారులకు ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. దాంతో స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు.. ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ట్యాంక్‌బండ్‌ మీద కేక్‌ కటింగ్స్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.

Read Also: దిక్కు, దివానా లేని పార్టీ కాంగ్రెస్..

పుట్టినరోజు, పెళ్లి రోజు ఇలా ప్రత్యేక సందర్భం ఏదైనా హైదరాబాద్‌ వాసులు ట్యాంక్‌బండ్‌కు పరుగులు తీస్తుంటారు. అక్కడ అర్ధరాత్రి సమయంలో కేక్‌ కట్‌ చేసి పార్టీ చేసుకుంటుంటారు. కేరింతలు, ఫొటోలు, సెల్ఫీలతో నానా హంగామా చేస్తుంటారు. అయితే, ఇలాంటి వేడుకల కారణంగా చుట్టుపక్కల పరిసరాలు కలుషితం అవ్వడమేకాకుండా.. రోడ్డుపై వెళ్తున్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ జీహెచ్‌ఎంసీకి, పోలీసులకు స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులపై ఎట్టకేలకు స్పందించిన జీహెచ్‌ఎంసీ అధికారులు ట్యాంక్‌బండ్‌పై కేక్‌ కటింగ్స్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రాంతాన్ని సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నామని.. పరిసరాల్లో చెత్తాచెదారం వేస్తే భారీ జరిమానా విధించనున్నట్లు బోర్డులు ఏర్పాటుచేశారు.

Latest News

More Articles