Saturday, May 4, 2024

మహిళలకు గుడ్ న్యూస్…మరింత తగ్గిన బంగారం ధర..!!

spot_img

మహిళలకు శుభవార్త. బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. గత వారం రోజులుగా దిగొస్తున్నాయి. బుధవారం కూడా భారీగా తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో తులం ధర రూ. 63వేల దిగువకు చేరింది. ఈ ఒక్కరోజే పది గ్రాముల బంగారం ధరపై రూ. 660 తగ్గింది. రూ. 62,180వద్ద ట్రేడ్ అయ్యింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 600పడిపోయి రూ. 57వేలుగా నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే గడిచిన వారం రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,000, 24 క్యారెట్ రూ. 1,050 కోల్పోయింది. ఢిల్లీలోనూ ఇదే కొనసాగుతోంది. బుధవారం స్పాట్ మార్కెట్లో రూ. 750 క్షీణించి 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,350కి చేరింది.

కాగా దేశీయ మార్కెట్లో క్షీణించిన డిమాండ్ తోపాటు అంతర్జాతీయ విపణిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు బంగారాన్ని భారీగా తగ్గించాయి. అంచనాలకు మించి అమెరికా ద్రవ్యోల్బణం పెరగడంతోపాటు బంగారం ధరలకు సెగపెడుతున్నదని ట్రేడింగ్ నిపుణులు అంటున్నారు.

వెండి ధరలూ కూడా భారీగా పడిపోయాయి. బుధవారం హైదరాబాద్‌లో కిలో ధర రూ.1,500 తగ్గి రూ.75,500 పలికింది. ఢిల్లీలోనూ రూ. 1,400 దిగి రూ.74,000లుగా నమోదైంది.

ఇది కూడా చదవండి:బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కు గాయాలు..ఫోటో షేర్ చేసిన హీరో..!

Latest News

More Articles