Saturday, May 11, 2024

టీటీడీ భక్తులకు శుభవార్త..శ్రీవారి దర్శనం మరింత సులభం..ఎలాగంటే?

spot_img

నిత్యం లక్షలాది మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రతిరోజూ గోవింద నామ స్మరణతో తిరుమల కొండలు మారుమ్రోగుతుంటాయి. కానీ శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే చాలా సమయం వేచి ఉండాల్సిందే. గంటల తరబడి క్యూలైన్స్, వెయిటింగ్ హాల్స్ లో వెయిట్ చేస్తేనే శ్రీవారి దర్శనం లభిస్తుంది. సాధారణ ప్రజలకు ఓ లైన్, ప్రత్యేక దర్శనాలకు మరో లైన్, వీఐపీలకు మరో స్పెషల్ దారి ఇలా పలు మార్గాల్లో శ్రీవారిని దర్శనం చేసుకుంటారు.

అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలను విధించారు. శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలను రద్దు చేయడంతో సాధారణ భక్తులకు కాస్త మేలు జరిగినట్లు అయ్యింది. మార్చి 16వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్ సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో శ్రీవాణి ట్రస్టుకు 10 వేల రూపాయల విరాళం అందించి రూ.500 బ్రేక్‌ దర్శన టికెట్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగింది. దీంతో ఈ 15 రోజుల్లో రూ.22.75 కోట్ల విరాళాలు అందాయి. మరోవైపు తిరుమలలో ఆఫ్‌లైన్‌ కోటా దర్శనం టికెట్ల కౌంటర్లను రెండు నుంచి నాలుగుకు పెంచడంతో సాధారణ ప్రజలకు ఎంతో మేలు జరిగింది.

ఇది కూడా చదవండి: ఆర్మూర్‌లో తెగిన నిజాంసాగర్‌ కాలువ కట్ట: ఇండ్లలోకి చేరిన నీరు

Latest News

More Articles