Sunday, May 19, 2024

పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీకి మంచి స్పందన

spot_img

హైదరాబాద్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీకి మంచి స్పందన వస్తుందని హైదరాబాద్  ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 10 వరకు చలాన్లను క్లియర్ చేసుకునేందుకు అవకాశం ఉందననారు. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Also Read.. ఫ్రీ బస్ ఎఫెక్ట్.. కుటుంబాన్ని పోషించలేక ఆటోడ్రైవర్ సూసైడ్

తెలంగాణ లో 3 కోట్ల 59 లక్షల చలాన్స్ పెండింగ్ లో ఉన్నాయని, అందులో ఇప్పటివరకు 77 లక్షల చలాన్స్ క్లియర్ అయినట్లు తెలిపారు. 67 కోట్లు రూపాయలు పెండింగ్ చలాన్ ల ద్వారా వచ్చిందన్నారు. హైదరాబాద్ కమిషనర్ పరిధిలో రూ.18 కోట్లు, సైబరాబాద్ కమిషనర్ పరిధిలో రూ.14 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో రూ.7.15 కోట్లు పెండింగ్ చలాన్స్ అమౌంట్ కలెక్ట్ అయిందన్నారు.

Also Read.. సముద్రంలో కూలిన విమానం.. ఇద్దరు కూతుళ్లతో సహా చనిపోయిన హలీవుడ్ నటుడు

ట్రాఫిక్ చలాన్ వెబ్ సైట్ లో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఫేక్ చలాన్ వెబ్ సైట్ రెండు ఉన్నాయని సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చింది. అవి 6 నెలల క్రితం సైబర్ నెరగాళ్లు క్రియేట్ చేశారు. అప్పుడే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఆ నకిలీ వెబ్ సైట్ లో పేమెంట్ గేట్ వేస్ లేవు. 6 నెలల క్రితం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్లు రెండు నకిలీ వెబ్ సైట్లను బ్లాక్ చేశారని తెలిపారు.

Latest News

More Articles