Friday, May 3, 2024

ఉద్యోగులకు గుడ్ న్యూస్..మీ ఖాతాల్లోకి ఆ డబ్బు వచ్చేస్తోంది.!

spot_img

సగటు ఉద్యోగి సంబరపడే సమయం జీతాల పెంపు. తాము పడిన కష్టాన్ని గుర్తించిజీతాలు పెంచడం ఉద్యోగులను సంతోషపెడుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాంటి ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్ లలో 4శాతం పెంపును గత నెలలోనే ప్రకటించారు. అయినప్పటికీ ఓ వర్గానికి చెందిన ఉద్యోగులకు పెన్షనర్లకు సవరణతో మార్చి నెల వేతనం అందలేదు. ఇప్పుడు రాబోయే జీతంలో వారందరికీ పెరిగిన వేతనంతోపాటు బకాయిలు కూడా చెల్లించేలా సర్కార్ సన్నాహాలు చేస్తుందని సమాచారం.

సదరు ఉద్యోగులు ఏప్రిల్ నెల జీతంలో సవరించిన వేతనంతోపాటు మూడు నెలల బకాయిలను పొందే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. దీంతో ఈవిషయం తెలిసిన ఉద్యోగులు సంబురపడుతున్నారు. 2023 అక్టోబర్ నెలలో చివరిసారిగాప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ ను నాలుగు శాతం పెంచారు. ఆ నాలుగు శాతం పెంపుతో డీఏ 42శాతం నుంచి 46శాతానికి పెరిగింది. తాజాగా మార్చినెలలో కేంద్ర కేబినెట్ డియర్ నెస్ అలవెన్స్ లో 4శాతం పెంపును ప్రకటించడంతో ఇది 50శాతానికి పెరిగింది.

దీంతో కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ 4 శాతం డీఏ పెంపు జనవరి 1, 2024 నుండి అమలులోకి వచ్చింది. డీఏ పెంపు ఆమోదం పొందిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతాలను పెంచడమే కాకుండా 2024 జనవరి నుంచి మార్చి వరకు వర్తించే డీఏ బకాయిలను కూడా చెల్లించనుంది. ఎందుకంటే ఈ పెరుగుదల జనవరి నుంచి వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..తొమ్మిది మంది దుర్మరణం.!

Latest News

More Articles