Sunday, May 19, 2024

పోస్టాఫీసు ఉద్యోగులకు ప్రభుత్వం కానుక.!

spot_img

దేశంలోని 2.56 లక్షల మంది పోస్టాఫీసు ఉద్యోగులకు ప్రభుత్వం కానుక అందించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం ఆర్థికాభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు. పోస్టాఫీసుల్లో పనిచేస్తున్న 2.56 లక్షలకు పైగా గ్రామీణ డాక్ సేవకుల (జిడిఎస్) సేవా పరిస్థితులను మెరుగుపరచడానికి ఈ పథకం తీసుకువచ్చింది సర్కార్. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ పథకం కింద, ప్రతి గ్రామీణ డాక్ సేవక్ వరుసగా 12, 24, 36 సంవత్సరాల సేవను పూర్తి చేసిన తర్వాత సంవత్సరానికి రూ. 4,320, 5,520, 7,200 చొప్పున 3 ఆర్థిక అప్‌గ్రేడేషన్‌లను పొందుతారు.

ఈ ఫైనాన్షియల్ అప్‌గ్రేడేషన్, టైమ్ రిలేటెడ్ కంటిన్యుటీ అలవెన్స్ (TRCA) రూపంలో గ్రామీణ డాక్ సేవక్‌లు పొందే అలవెన్సులకు అదనంగా ఉంటుంది. కేంద్రమంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ, సంక్షేమ కార్యక్రమాల శ్రేణిని ముందుకు తీసుకువెళుతున్న ప్రభుత్వం ఇప్పుడు గ్రామీణ డాక్ సేవక్ ఫైనాన్షియల్ అప్‌గ్రేడేషన్, 2024తో ముందుకు వచ్చిందన్నారు.’గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ వ్యవస్థకు గ్రామీణ డాక్ సేవకులు వెన్నెముక వంటిదన్నారు. 2.5 లక్షలకు పైగా గ్రామీణ డాక్ సేవకులు మన దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఆర్థిక సేవలు, పార్శిల్ డెలివరీ, ఇతర G2C సేవలను అందిస్తున్నారు. ‘గ్రామీణ డాక్ సేవకుల సేవా పరిస్థితులను మెరుగుపరచడానికి ఒక ముఖ్యమైన దశగా, ఈ పథకం 2.56 లక్షల కంటే ఎక్కువ GD లకు ప్రయోజనం చేకూరుస్తుందని.. వారి సేవలో స్తబ్దతను తొలగిస్తుందని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

తపాలా నెట్‌వర్క్‌ను సర్వీస్ డెలివరీ నెట్‌వర్క్‌గా మార్చాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికమని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ విజన్‌ని అమలు చేసేందుకు ప్రభుత్వం దేశంలోని అన్ని పోస్టాఫీసులను డిజిటలైజేషన్‌ చేసింది. పాస్‌పోర్ట్ సేవ, ఆధార్ సేవ, పోస్టల్ ఎగుమతి కేంద్రం వంటి కొత్త సేవలు ప్రారంభించాయి.

ఇది కూడా చదవండి: మద్యం కుంభకోణం కేసులో నేడు కేజ్రీవాల్ అరెస్టు?

Latest News

More Articles