Sunday, May 19, 2024

ఇద్దరు అమెరికన్లను విడిచిపెట్టిన హమాస్‌

spot_img

అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై మెరుపుదాడి చేసిన హమాస్‌ ఉగ్రవాదులు సుమారు 200 మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వారిలో ఇద్దరు అమెరికన్లను హమాస్‌ వదిలిపెట్టింది. జుడిత్‌ తై రానన్‌, ఆమె కుమార్తె 17 ఏళ్ల నటాలీ శోషనా రానన్‌ను విడుదల చేశారు. శుక్రవారం రాత్రి వారు ఇజ్రాయెల్‌ చేరుకున్నారు. మరోవైపు అమెరికన్లను విడుదల చేయడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్వాగతించారు.

Also Read.. తన తండ్రి చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయి

ఇదిలా ఉండగా ఖతార్‌, ఈజిప్టులతో సంప్రదింపుల అనంతరం మానవతా కోణంలో భాగంగా అమెరికన్లను విడుదల చేసినట్లు హమాస్ ప్రకటించింది. ఇప్పటివరకు హమాస్‌ దాడిలో 1,400 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఇజ్రాయెల్‌ దాడిలో సుమారు 4,137 మంది మరణించారు. యుద్ధం నేపథ్యంలో 10 లక్షల మందికిపైగా ప్రజలు గాజాను వీడారు.

Latest News

More Articles