Friday, May 17, 2024

బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా.. ఆసుపత్రికి తరలింపు..!

spot_img

వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో పూణె వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. మ్యాచ్ లో ఇండియా 9వ ఓవర్ లో బౌలింగ్ చేస్తుండగా… బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ లిట్టన్ దాస్ స్ట్రయిట్ డ్రైవ్ కొట్టాడు. ఆ బంతిని ఆపే ప్రయత్నంలో పాండ్యా గాయపడ్డాడు. ఫిజియో వచ్చి హార్దిక్ ను పరీక్షించాడు. ఆ తర్వాత బౌలింగ్ చేయడానికి హార్దిక్ ఇబ్బంది పడ్డాడు. దీంతో గ్రౌండ్ ను వీడి వెళ్లిపోయాడు.

స్కానింగ్ కోసం పాండ్యాను ఆసుపత్రికి తరలించినట్టు బీసీసీఐ తెలిపింది. ఒక మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోందని చెప్పింది.

ఇది కూడా చదవండి: కుటుంబ పాల‌నపై రాహుల్ గాంధీకి కేటీఆర్ సెటైర్

Latest News

More Articles