Sunday, May 19, 2024

హరీశ్ రావు అంటే అట్లుంటది.. 100 మోకాలి మార్పిడి సర్జరీల రికార్డ్!

spot_img

మంత్రి హరీశ్ రావుకు క్రేజ్ మూములగా ఉండదు. తన నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ వ్యాప్తంగానే కాదు పొరుగు రాష్ట్రాల్లోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పిలకరిస్తూ.. మామకు తగ్గ అల్లుడు అనిపించుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో 100 మందికి మోకాలు శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. ఓ వృద్దుడికి చేసిన శస్త్ర చికిత్సతో వంద ఆపరేషన్లు పూర్తయ్యినట్లు వైద్యాధికారులు తెలిపారు. దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వృద్దుడు ఐదేళ్లుగా మోకాలు నొప్పితో బాధపడతున్నాడు. దీంతో ఆయన వారం రోజుల క్రితం ప్రభుత్వాసుపత్రి వైద్యులను సంప్రదించాడు. అతన్ని పరీక్షించిన ఆర్థోపెడిక్ విభాగ వైద్యులు మోకాళ్ల సమస్యగా గుర్తించారు. అనంతరం ఉస్మానియా సర్జన్ ఆధ్వర్యంలో సుమారు రెండున్న గంటల పాటు శ్రమించి మోకాలు మార్పిడి ఆపరేషన్ విజయవంతం చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ పండగలను సగర్వంగా చాటిచెబుదాం

గ్రామాల్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా మోకాలు నొప్పులతో బాధపడుతున్న 50 నుంచి 60ఏళ్ల పై బడినవారిని గుర్తించి అవసరమైన పరీక్షలు నిర్వహించి ప్రభుత్వాసుపత్రిలో వారానికి నాలుగు ఆపరేషన్లు చేశారు. అలా ఇప్పటి వరకు సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రిలో 100 మందికి మోకాలు మార్పిడి చికిత్సలు చేశారు. ఈ ఆపరేషన్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకోవాలంటే రూ. 3 నుంచి రూ. 6లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వాసుపత్రిలో ఫ్రీగా ఆపరేషన్లు నిర్వహించినట్లు వైద్యులు చెప్పారు. మంత్రి హరీశ్ రావు పట్టుదలతో సిద్ధిపేట జిల్లా వైద్యసేవారంగంలోనూ మొదటి ప్లేస్ లో నిలవబోతోందని హరీశ్ రావు అభిమానులు అంటున్నారు.

Latest News

More Articles