Saturday, May 18, 2024

హర్యాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ రాజీనామా

spot_img

హర్యాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఇవాళ( మంగళవారం) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మధ్యాహ్నం గవర్నర్‌ బండారు దత్తాత్రేయను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ రోజే నూతన సీఎం ను ఎన్నుకునే అవకాశముంది.

లోక్‌సభ ఎన్నికల వేళ.. బీజేపీ మిత్రపక్షం జేజేపీ మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సంకీర్ణ ప్రభుత్వానికి ఖట్టర్‌ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత సీఎంగా నయబ్‌ సైనీ, సంజయ్‌ భాటియా వంటి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఖట్టరే మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బీజేపీనేతలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

90 స్థానాలున్న హర్యాణా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలుండగా.. జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ)కి 10 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌కు 30, ఇండియన్‌ నేషనల్ కాంగ్రెస్‌ లోక్‌ దళ్‌, హర్యాణా లోక్‌హిత్‌ పార్టీకి చెరొక సభ్యుడు ఉన్నారు. ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఆరుగురు  బీజేపీకి మద్దతు ఇస్తున్నారు.  ఇవాళ ఉదయం నుంచే ఖట్టర్ రాజీనామా గురించి వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ, జేజేపీ విడివిడిగా సమావేశాలు నిర్వహించాయి. జేజేపీ వ్యవస్థాపకుడు, డిప్యూటీ సీఎం దుష్యంత్‌ చౌతాలా సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. కనీసం నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఎన్‌కౌంట‌ర్.. ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు

Latest News

More Articles