Friday, May 17, 2024

ముంబైలో కురుస్తున్న భారీ వర్షం..ఎల్లోఅలర్ట్ జారీ

spot_img

నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ(శనివారం) భారీ వర్షం కురుస్తోంది. ముంబైలోని పలు ప్రాంతాల్లో నిన్న(శుక్రవారం) నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కాలనీల్లోకి వర్షం నీరు రావడంతో అక్కడి ప్రజలు బయటకు కూడా రాని పరిస్థితి ఏర్పడింది.

రానున్న నాలుగైదు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ముంబై నగర వ్యాప్తంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో జూన్ 26-27 తేదీల్లో నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.అత్యవసరం అయితే ప్రజలు బయటకు రావాలని సూచించింది.

Latest News

More Articles