Tuesday, May 14, 2024

మానుకోట జిల్లాలో జోరుగా ఇసుక దందా..పట్టించుకోని అధికారులు..!!

spot_img

మహబూబాబాద్ జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. అక్రమార్కులు రాత్రికి రాత్రే వాగులో ఇసుకను తవ్వేస్తున్నారు. ట్రాక్టర్లలో నింపుతూ జిల్లా కేంద్రంతోపాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ అధికారులను ఎన్నిసార్లు సూచించినప్పటికీ తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. నర్సింహులపేట మండలంలోని కౌసల్యదేవి, బొజ్జన్నపేట, కొమ్ములవంచ, జయపురం గ్రామశివారుల్లోని ఉన్నవాగుల్లో అర్థరాత్రి 12గంటల నుంచి తెల్లవారుజామున 4గంటల వరకు తవ్వకాలు జరిపి ఇసుకను అక్రమంగా తరలిస్తు జేబులు నింపుకుంటున్నారు.

కాగా ఇదే మండలంలో గతంలో స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు ఇసుక డంపులు సీజ్ చేశారు. వేలం పాట కూడా వేశారు. ఇప్పుడు మాత్రం అధికారుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. చిన్నకోడూరు, మరిపెడ, డోర్నకల్, బయ్యారం మండలాల్లో వాగుల నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతుంది. ముల్కలపల్లిలోని ఆకేరువాగు నుంచి ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. వందలాది ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్న విషయం తెలిసి కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు నిఘాపెట్టి అక్రమార్కుల భరతం పెట్టాలనిస్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని సర్కార్ నిర్ణయం..!!

Latest News

More Articles