Tuesday, May 14, 2024

వాహనదారులకు అలర్ట్.. నేడు హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్‌ ఆంక్షలు

spot_img

వాహనదారులకు నగర పోలీసులు ఓ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లో ఈ రోజు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. సిటీలోని ఎల్బీ స్టేడియంలో మంగళవారం మధ్యాహ్నం బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది. దీనికి ప్రధాని మోడీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అధికారులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆ సమయంలో ఎల్బీ స్టేడియం చుట్టుపక్కన ప్రాంతాల్లో రహదారుల మూసివేత, దారిమళ్లింపులు ఉంటాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

Read Also: రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు

ఈ మార్గాల్లో ఆంక్షలు..

  • ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ జంక్షన్‌ నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు ట్రాఫిక్‌కు అనుమతి ఉండదు. వాహనాలను నాంపల్లి, రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు.
  • అబిడ్స్‌, గన్‌ఫౌండ్రి నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ వాహనాలను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రి నుంచి చాపల్‌ రోడ్డులోకి మళ్లిస్తారు.
  • ట్యాంక్‌బండ్‌ నుంచి బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వైపు వెళ్లే వాహనాలను లిబర్టీ జంక్షన్‌ వద్ద హిమాయత్‌నగర్‌ వైపు మళ్లిస్తారు.

Latest News

More Articles