Friday, May 17, 2024

మణిపూర్ లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం హెల్ప్ లైన్

spot_img

హైదరాబాద్: మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న అస్థిర పరిస్థుల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ పౌరులను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసినట్టు డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు.

డీఐజీ బి. సుమతి ని ఇన్ఛార్జిగా ఉన్నారని, 7901643283 అనే నెంబర్ కు గానీ, [email protected] అనే మెయిల్ లో సంప్రదించవచ్చని డీజీపీ పేర్కొన్నారు. ఈ విషయమై తగు సహాయం అందించేందుకై మణిపూర్ రాష్ట్ర పోలీసులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని డీజీపీ తెలియచేశారు.

Latest News

More Articles