Friday, May 17, 2024

రామమందిరం ప్రాణ ప్రతిష్ట… హైద‌రాబాద్ లో హై అల‌ర్ట్

spot_img

అయోధ్యలోని రామమందిరం ఇవాళ(సోమవారం) ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అల‌ర్ట్ అయ్యారు. హైద‌రాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సున్నితమైన అన్ని ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ గా ఉండాలని పోలీసు కమిషనర్లు తెలిపారు.

పక్కాగా బందోబస్త్ ప్లాన్ చేయాలని ఆదేశించారు. స్థానిక పోలీసులకు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, గ్రే హౌండ్స్, సాయుధ రిజర్వ్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేంద్ర బలగాలు సహాయం అందిస్తాయని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. మతపరమైన సున్నితమైన ప్రదేశాలలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిద్ధంగా ఉంది.

అంతేకాదు.. మతపరమైన సున్నితమైన ప్రదేశాలలో పోలీసు పికెట్‌లను భారీగా మోహరించినట్లు డీజీపీ రవి గుప్తా తెలిపారు. బంజారాహిల్స్ లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రజల కదలికను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రత్యేక ప్రార్థనా సమావేశాలు నిర్వహించే ప్రదేశాలను గుర్తించి భద్రతా ఏర్పాట్లు ప్రారంభించాలని స్థానిక పోలీసులను డీజీపీ ఆదేశించారు. ఇక, సీనియర్ అధికారులు ముందు జాగ్రత్త చర్యగా నగరంలోని మతపరమైన సున్నిత ప్రాంతాలలో విడిది ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండాలన్నారు.

ఇది కూడా చదవండి: హరితహారం పేరు మార్చేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్..!!

Latest News

More Articles