Sunday, May 19, 2024

ఆర్టీసీలో ఉచిత ప్రయాణం రద్దు.. హైకోర్టులో విచారణ

spot_img

ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై నాగోలుకు చెందిన హరిందర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ఉచిత ప్రయాణం వల్ల బస్సులలో తీవ్రరద్దీ పెరిగిందని పిటీషన్‌లో పేర్కొన్నాడు హరిందర్. కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు బస్సులో నిలబడే పరిస్థితి లేదన్నాడు హరిందర్. ఉచిత ప్రయాణం కోసం జారీ జారీ చేసిన జీఓ 47ను వెంటనే రద్దు చేయాలని హరిందర్ కోరారు.

అయితే ఈ పిటీషన్‌లో ప్రజా ప్రయోజనమేమీ లేదని పేర్కొంది హైకోర్టు. పిటీషనర్ ఇబ్బంది ఎదుర్కొని మాత్రమే పిల్ దాఖలు చేశారని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటీషన్‌గా మార్చాలని రిజిస్ట్రీకి ఆదేశం చేసి..విచారణను వాయిదా వేసింది ధర్మాసనం.

Latest News

More Articles