Monday, May 20, 2024

సీఎం కేసీఆర్ హరితహారం స్ఫూర్తితోనే HMDAకి అవార్డుల పంట

spot_img

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రవేశపెట్టిన హరితహారం స్ఫూర్తితోనే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) ఎన్నో జాతీయ, అంతర్జాతీయ గ్రీనరీ అవార్డులను సాధించిందని మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మెట్రోపాలిటన్ కమిషనర్ అర్విoద్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా కొత్వాల్ గూడ ఎకో పార్క్ కు చేరుకుని దాదాపు 15 అడుగుల ఎత్తైన మర్రిచెట్టును కొత్వాల్ గూడ ప్రాంగణంలో నాటారు అర్విoద్ కుమార్.

ఇక బాచుపల్లి మల్లంపేట్ రోడ్డు విస్తరణలో 126 మర్రి, రావి జాతులకు సంబంధించిన చెట్లను హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ యంత్రాంగం కొత్వాల్ గూడ ఎకో పార్క్ లో ట్రాన్స్ లోకేషన్ చేస్తున్నాయి. దాదాపు 200 మందికి పైగా హెచ్ఎండీఏ, హెచ్.జి.సి.ఎల్ ఉద్యోగులు, సిబ్బంది సోమవారం కొత్వాల్ గూడ ఎకో పార్క్ లో 15,000 మొక్కలు నాటారు. మహేశ్వరంలో 25,000 మొక్కలు, ఔటర్ రింగ్ రోడ్డు(ఓఅర్అర్) పరిసర ప్రాంతాలు, జంట నగరాలలో 30 కేంద్రాల్లో 1,50,000 మొక్కలు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ యంత్రాంగం ఆధ్వర్యంలో 1,90,000 మొక్కలు, 126 మర్రి జాతుల చెట్లను నాటి రికార్డు సాధించారు.

\

Latest News

More Articles