Sunday, May 19, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం..తెలంగాణలో వర్షం పడే ఛాన్స్..?

spot_img

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు మూడు రోజుల్లో దీని ప్రభావం తుఫాన్ గా మారే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాల ప్రభావంతో తీర ప్రాంత రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో గత వారం నుంచి వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే ఈశాన్య రుతుపవనాల నేపథ్యంలో థాయ్ లాండ్ మీదుగా వచ్చే ఉపరితల ఆవర్తనం ఆదివారం దక్షిణ అండమాన్ నికోబార్ సముద్రంలోకి ప్రవేశించనున్నాయి. దీని ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడునుందని భారత వాతావరణశాఖ తెలిపింది.

అయితే నేడు దక్షిణ తెలంగాణ, రాయలసీమలో మేఘాలు కమ్ముకుంటాయి. మధ్యాహ్నం 2గంటల తర్వాత ఏపీతోపాటు దక్షిణ తెలంగాణలో మేఘాలు ఉంటాయి. సాయంత్రం 7 తర్వాత రాయలసీమలో మాత్రమే మేఘాలు కమ్ముకుని ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు పడే అవకాశం లేదని ఐఎండీ తెలిపింది.
బంగాళాఖాతంలో గాలుల వేగం ెక్కువగా ఉందని 22 కిలోమీటర్ల నుంచి 34 కిలోమీటర్ల దాకా ఉందని తెలిపింది. ఉత్తరాంధ్రలో గాలుల వేగం గంటకు 6 నుంచి 12 కిలోమీటర్లుగా ఉంది. కోస్తా రాయలసీమలో గంటకు 10 నుంచి 18 వరకు ఉంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో చల్లదనం పెరుగుతోందని ఐఎండీ తెలిపింది.

ఇది కూడా చదవండి: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ మూడు రోజులు వైన్ షాప్స్ బంద్..!!

Latest News

More Articles