Friday, May 17, 2024

విశాఖ ఫిషింగ్ లో భారీ అగ్నిప్రమాదం..60 బోట్లు దగ్ధం..!!

spot_img

ఏపీలోని వివాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి బోట్లకు ఉన్నట్లుండి నిప్పు అంటుకుంది. ఈ ప్రమాదంలో 60బోట్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తం ఆస్తినష్టం 30కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ఈ బోట్లలో భారీ చమురు, పెట్రోలు ఇతరత్రా మండే స్వభావం ఉన్న వాటిని ఉంచారు. దీంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అయితే బోట్లలో ఎవరైనా ఉన్నారా లేరా అన్న సంగతి తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ ప్రమాదానికి కారణం తెలియరాలేదు. ఎవరైనా కావాలనే ఈ పని చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దర్యాప్తు కొనసాగుతోంది. ముందుగా ఒక బోటులోమంటలు వచ్చి…తర్వాత ఇతర బోట్లకు వ్యాపించినట్లు కొందరు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో భారీ భూకంపం..భయంతో పరుగులు పెట్టిన జనం..!!

Latest News

More Articles