Monday, May 13, 2024

సంక్రాంతికి ఊపిరి పీల్చుకున్న హైదరాబద్

spot_img

మినీ ఇండియాగా పేరుగాంచిన నగరం హైదరాబాద్. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలతో నగరం అన్ని వేళల్లో కళకళ లాడుతుంటుంది. నిత్యం రద్దీ, రోడ్లపై భారీ ట్రాఫిక్, 24గంటలు జనాలతో కిక్కిరిసిపోయే నగరం మొన్న సంక్రాంతి సందర్భంగా బోసిపోయింది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చి స్థిరపడినవారంతా సంక్రాంతి పండగని చేసుకోవడానికి వారి సొంతూళ్లకు బయల్దేరివెళ్లారు. వీరంతా సొంత వాహనాలను నగరంలోనే వదిలేసి బస్సులో, రైళ్లల్లో తమ ఊర్లకు వెళ్లిపోయారు. దాంతో జనవరి 13 నుండి 17 మధ్య రద్దీగా ఉండే నగరం బోసిపోయింది. ముఖ్యంగా అమీర్ పెట్, కూకట్ పల్లి, IT కారిడార్ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.

దాదాపు 80 లక్షల వాహనాలు గ్రేటర్ హైదరాబాద్ లో తిరుగుతుండగా.. వీటిలో సగానికిసగం తగ్గటంతో ట్రాఫిక్ లేక హైదరాబాద్ నగరంలో గాలి నాణ్యత మెరుగుపడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి లైవ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం.. హైదరాబాద్ విశ్వవిద్యాలయం (UoH), సనత్‌నగర్, ఇక్రిసాట్, పటాన్‌చెరు,నాచారంలలో గంతోల గాలి కాలుశ్యం ఎక్కవగా ఉండగా.. పండగ వేలలో గాలి నాణ్యత పెరిగింది. హైదరాబాద్ నగరంలో వాహనాల రాకపోకలు తగ్గినందువల్లే కాలుష్యం తగ్గిందని ప్రముఖ పర్యావరణవేత్త ప్రసన్న కుమార్ అన్నారు. కాలుష్యం తగ్గిన విషయం తెలిసిన చాలా మంది నగర ప్రజలు ఇప్పుడే ఇలాగే ఉంటే బాగుండు అని అభిప్రాయపడుతున్నారు.

Latest News

More Articles