Saturday, May 18, 2024

420 హామీలను అమ‌లు చేసేదాకా విడిచి పెట్టం

spot_img

 హైద‌రాబాద్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నోటికి ఎంత వస్తే అంత అనుకుంటూ హామీలు ఇచ్చిందని.. అందుకే 420 హామీలను అమ‌లు చేసేదాకా విడిచి పెట్టమని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మెద‌క్ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి స‌మావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Also Read.. ఈనెల 20, 21 తేదీలలో ఓటర్ నమోదుకు ప్రత్యేక క్యాంపెయిన్

గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలం అయ్యిందని అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. అందుకే స్వేద పత్రం విడుదల చేశామని, అందులో తెలంగాణ సమగ్ర అభివృద్ధిని పొందుపరిచినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న‌ రుణమాఫీ చేస్తా.. రూ. 2 లక్షల రుణం తెచ్చుకోండని పీసీసీ అధ్య‌క్షుడి హోదాలో రేవంత్ మాట్లాడారని గుర్తుచేశారు. కానీ తుమ్మల నాగేశ్వర్‌ రావు మాత్రం రుణాలు వసూలు చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారని, పైగా రుణాలు కట్టని వారిపై కేసులు పెట్టండని ఆదేశించినట్లు పత్రికల్లో వచ్చిందన్నారు.

Also Read.. రైతుబంధు రాలేదంటే చెప్పుతో కొడతా.. కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న పరుష పదజాలం

నిరుద్యోగ భృతిపై అసెంబ్లీ సాక్షిగా అబద్దం చెప్పి అడ్డంగా దొరికారని తెలిపారు. ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పగా.. భట్టి విక్ర‌మార్క‌ భృతి ఇస్తామని చెప్పలేదని హరీష్ రావు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా అబద్దం చెప్పారని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని హామీ ఇచ్చారని, కానీ అది సాధ్యం కాదని స్పష్టమైందని కేటీఆర్ పేర్కొన్నారు.

Also Read.. ఢిల్లీలో విమానాల రాకపోకలపై ఆంక్షలు

మొన్నటిరవకు ప్రధాని, అదానీ ఒక్కటని విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి.. దావోస్ లో ఆయనతోనే ఒప్పందాలు చేసుకున్నారు.  రాహుల్ గాంధీ ఓ పక్క అదానీని తిడుతుంటే.. అదే సమయంలో రేవంత్ రెడ్డి దావోస్‌లో ఆయనతో ఉన్నాడని తెలిపారు. కేసీఆర్ ఉన్నంత కాలం అదానీ తెలంగాణ అడుగు పెట్టలేదని, కానీ కాంగ్రెస్ రాగానే ఎలా అడుగు పెడుతున్నాడ‌ని కేటీఆర్ ప్రశ్నించారు. ఈసారి కూడా మెదక్‌లో గులాబీ జెండా ఎగరబోతున్నదన్నారు. గత పదేళ్ళలో మన బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే పార్లమెంట్ లో తెలంగాణ గురించి మాట్లాడారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాలు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాపాడుతుందన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించి చెప్పాలని కేటీఆర్ సూచించారు. 

Latest News

More Articles