Sunday, May 19, 2024

న్యూఇయర్ రోజు రాత్రి 12.30 గంటలకే కస్టమర్లను పంపించేయాలి

spot_img

ఇయర్ ఎండింగ్ క్రైమ్ రివ్యూపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ‘తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయి 10 ఏళ్ళు పూర్తి అయింది. గతేడాదితో పోలిస్తే హైదరాబాద్‎లో 2 శాతం నేరాల సంఖ్య పెరిగింది. దాదాపు 8 రకాల నేరాలు బాగా పెరిగిపోయాయి. ఆర్ధిక, సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎఫ్ఐఆర్లు 24, 821 నమోదు కాగా, 9 శాతం మేర పెరిగిన దోపిడీలు, మహిళలపై 12 శాతం నేరాలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే చిన్నారులపై 12శాతం నేరాలు తగ్గాయి. వివిధ కేసుల్లో జరిగిన నష్టం విలువ 38 కోట్ల రూపాయలు. పోయిన సొమ్ములో 75 శాతం రికవరీ చేశాం. హత్యలు 79, రేప్ కేసులు 403, కిడ్నాప్లు 242, చీటింగ్ కేసులు 4909 నమోదు అయ్యాయి. రోడ్డు ప్రమాదాలు 2637, హత్యాయత్నాలు 262, చోరీలు 91 నమోదు అయ్యాయి.

Read Also: ఈ అమ్మాయి ఆచూకీ చెప్పిన వారికి రూ. 8 లక్షల రివార్డ్

ఈ ఏడాది 63శాతం నేరస్తులకు శిక్షలు పడ్డాయి. 13 కేసుల్లో 13 మందికి జీవిత ఖైదీ శిక్షలు పడ్డాయి. అలాగే డ్రగ్స్ కేసులో నార్కోటిక్ బ్యూరో దృష్టి పెడుతుంది. స్నైపర్ డాగ్స్ ద్వారా మాఫియాను వెతికి పట్టుకుంటాం. పబ్స్‎లో డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో వాడినట్లు సమచారం వచ్చినా చాలు వెరిఫై చేసి వాళ్ళ వ్యాపారాన్ని పూర్తిగా క్లోజ్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో తిరిగి పబ్స్ ఓపెన్ చేయించే ప్రసక్తి ఉండదు. న్యూ ఇయర్ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే ఈవెంట్స్, పబ్‎లకు అనుమతి ఇచ్చాం. రాత్రి 12.30 నుంచే కష్టమర్లను బయటకి పంపాలి. న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కడైనా డ్రగ్స్ సేవించిన, సప్లై చేసిన కఠిన చర్యలు తీసుకుంటాం. న్యూ ఇయర్ వేడుకలపై ప్రత్యేక నిఘా పెడుతున్నాం’ అని సీపీ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.

Latest News

More Articles