Monday, May 13, 2024

హైదరాబాద్‌లో అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. విశాఖలో సూసైడ్!

spot_img

హైదరాబాద్: కేపీహెచ్ బీ లో అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విశాఖపట్నం బీచ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసంతనగర్ లో మెడోల్యాండ్స్ అపార్ట్మెంట్లో ఆకుల శ్రీధర్ కుమార్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నివాసం ఉంటున్నాడు.

ఇది కూడా చదవండి: తన చితిని తానే పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్న వృద్ధుడు

కుటుంబ గొడవల కారణంగా మనస్తాపం చెంది ఈ నెల 10న ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు వాకబు చేసినా ఫలితం లేక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్న క్రమంలో శ్రీధర్ విశాఖపట్నం బీచ్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు బుధవారం సమాచారం అందినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: హైదరాబాద్‎లో కాంగ్రెస్ జాతీయ నేతల స్కాంలతో పోస్టర్లు

Latest News

More Articles