Sunday, May 19, 2024

హైదరాబాద్‎లో నోరూరిస్తున్న బ్రిక్ బిర్యానీ

spot_img

ఇప్పుడున్న కాలంలో బిర్యానీ తినని వారుండరు. వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ ఇలా ఎవరికి నచ్చిన బిర్యానీని వాళ్లు తింటుంటారు. దేశవిదేశాల నుంచి వచ్చే వారందరూ హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే లొట్టలేసుకుంటూ తింటారు. ఇప్పటికే కుండ బిర్యానీ, ముంత బిర్యానీ, బకెట్ బిర్యానీ అంటూ వివిధ రకాల బిర్యానీలను రుచిచూశారు. తాజాగా.. మరో కొత్త బిర్యానీ అందుబాటులోకి వచ్చింది. అదే బ్రిక్ బిర్యానీ. ఇటుకతో తయారైన దీర్ఘచతురస్ర పాత్రలో అడుగున నెయ్యి రాసి, బిర్యానీకి అవసరమైన పదార్థాలన్నీ ఉంచి మూత పెట్టి ఉడికిస్తే.. ఘుమఘుమలాడే బ్రిక్‌ బిర్యానీ సిద్ధం. ఇదెక్కడో వేరే రాష్ట్రంలో కాదండోయ్‌… హైదరాబాద్‌ కొంపల్లిలోనే చేస్తున్నారు. ఖరీదు ఎక్కువేమో అనుకుంటున్నారా?. ఉహూ.. కేవలం 189 రూపాయలే. అందరికీ అందుబాటులో ఉంది. వింటేనే నోరూరుతోంది కదూ.. ఈ ఇటుక బిర్యానీ భోజన ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. రుచి చూసిన వాళ్లంతా.. సూపర్‌ రుచితో పసందుగా ఉందంటూ తెగ పొగుడుతున్నారు. మరెందుకు ఆలస్యం.. అటుగా వెళ్తే మీరూ తిని ఎంజాయ్ చేయండి.

Latest News

More Articles