Monday, May 20, 2024

టీ20 ప్ర‌పంచ క‌ప్ షెడ్యూల్.. జూన్ 1 నుంచి సమరమే!

spot_img

న్యూఢిల్లీ: అమెరికా, వెస్టిండీస్  సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్ వ‌చ్చేసింది. ఈ మోగా టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ శుక్ర‌వారం విడుద‌ల చేసింది. జూన్ 1వ తేదీన కెన‌డా, యూఏఈ మ్యాచ్ తో టోర్నీ ప్రారంభం కానుంది. ఇక క్రికెట్ అభిమానులు ఎదురుచూసే భార‌త్, పాకిస్థాన్ మ్యాచ్ 9వ తేదీన‌ న్యూయార్క్‌లో జరుగనుంది. ఇక జూన్ 26, 27వ తేదీల్లో సెమీ ఫైనల్స్‌ ఉండగా.. బార్బ‌డోస్‌లో జూన్ 29వ తేదీన ఫైన‌ల్ మ్యాచ్ నిర్వ‌హించ‌నున్నారు.

గ్రూప్ ఏలో ఉన్న టీమిండియా జ‌ట్టు నాలుగు లీగ్ మ్యాచులు ఆడ‌నుంది. తొలి పోరులో  జూన్ 5న‌ ఐర్లాండ్‌ను.. పాకిస్థాన్‌తో జూన్ 9న న్యూయార్క్‌లో త‌ల‌ప‌డ‌నుంది. జూన్ 12న న్యూయార్క్ స్టేడియంలో అమెరికా జ‌ట్టుతో.. 15వ తేదీన ఫ్లోరిడాలో కెన్యాతో ఆడనుంది.

 

Latest News

More Articles