Saturday, May 18, 2024

ఇంగ్లండ్ బ్యాటర్‌ను అడ్డుకున్న బుమ్రాపై ఐసీసీ చర్యలు

spot_img

టీమిండియా పేసర్ జ‌స్ప్రీత్ బుమ్రాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో ఐసీసీ నిబంధనను ఉల్లంఘించినందుకు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. తొలి టెస్టు నాలుగో రోజు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా ఉద్దేశ‌పూర్వ‌కంగా ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్‌కు అడ్డంగా నిల్చున్నాడు.

బుమ్రా వేసిన 81వ ఓవ‌ర్ ఇది జరిగింది. పోప్ సింగిల్ తీసేందుకు పరుగు తీసేందుకు ప్రయత్నించగా బుమ్రా అత‌డికి అడ్డుగా నిల‌బ‌డ్డాడు. మ్యాచ్ అనంతరం మ్యాచ్ రిఫ‌రీ బుమ్రా లెవ‌ల్ 1 నేరానికి పాల్ప‌డ్డాడ‌ని ఐసీసీకి నివేదించాడు. బుమ్రా త‌న త‌ప్పు అంగీక‌రించడంతో రిఫ‌రీలు అత‌డికి ఒక డీమెరిట్ పాయింట్ విధించారు.

ఇదిలా ఉండగా. తొలిటెస్టులో టీమిండియా ఓడిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్ సూప‌ర్ సెంచ‌రీతో రాణించడంతో ఆ జట్టు 420 ర‌న్స్ కొట్టింది. బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు. 231 ప‌రుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భార‌త్..ఇంగ్లండ్ యువ స్పిన్న‌ర్ టామ్ హ‌ర్ట్లే (ఏడు వికెట్లు) సంచ‌ల‌న బౌలింగ్‌ కారణంగా తడబడింది. దీంతో ఇంగ్లండ్‌ చేతిలో భారత్ 28 ప‌రుగుల‌ తేడాతో ఓటమి పాలయింది.  రెండో టెస్టు వైజాగ్‌లో ఫిబ్ర‌వ‌రి 2న జ‌రుగ‌నుంది.

 

Latest News

More Articles