Monday, May 20, 2024

గణేషుడికి ఈ ప్రసాదాలు సమర్పిస్తే..వెంటనే ప్రసన్నమైపోతాడట..!!

spot_img

వినాయక చవితి వచ్చేస్తోంది. గణేశోత్సవానికి అన్ని చోట్లా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వినాయకుడిని స్వాగతించేందుకు భక్తులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలంకారాల నుంచి ప్రసాదం వరకు అన్నీ నిర్ణయించుకుని గణపతి సేవను వైభవంగా నిర్వహించేందుకు అందరూ సిద్ధమవుతున్నారు.

గణేశుడికి నైవేద్యంగా మోదకం, బియ్యం, కొబ్బరి, బెల్లంతో తయారు చేసిన ఆహారాన్ని ముందుగా సమర్పిస్తారు. మోదకము వినాయకునికి ప్రీతికరమైనది కనుక దానిని విడిచిపెట్టి వడే నివేద్యము చేయవచ్చు. శనగ చూర్ణం నైవేద్యంగా పెట్టవచ్చు. గణేశోత్సవంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గణనాయకుడికి ప్రసాదం సమర్పించాలి. అందులో ధాన్యాలు, బర్ఫీ, గ్రాన్యులేటెడ్ షుగర్, పండ్లు వంటి రోజువారీ ప్రసాదాన్ని మనం ఇవ్వవచ్చు.

కుడుములు:
కావాల్సిన పదార్థాలు:
బియ్యం రవ్వ- 1 కప్పు
శనగపప్పు- కొద్దిగా
కొబ్బరి తురుము- 1 కప్పు
ఉప్పు -రుచికి సరిపడా

తయారీ విధానం:
ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు పోయాలి, అందులో తగినంత ఉప్పు, శనగపప్పు వేసి స్టౌ మీద పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వపోయాలి. మెత్తగా ఉడికిన , తర్వాత కిందకు దించి కొబ్బరి తురుము వేసి కలపాలి. చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకొని, ఇడ్లీ ప్లేట్‌‌లో పెట్టి, ఆవిరి మీద ఐదు నిమిషాలు పాటు ఉడికిస్తే కుడుములు రెడీ.

పాలతాలికలు:
కావలసిన వస్తువులు:
‌పాలు – 1 లీటరు.
నీళ్లు – 1లీటరు.
‌సగ్గు బియ్యం – ‌100 గ్రాములు.
బియ్యపిండి – 100గ్రాములు.
మైదాపిండి – 2 టీ స్పూన్లు
పంచదార – 200గ్రా.
‌బెల్లం – 1/3కేజి.
‌ఏలకులపొడి – 1 టీ స్పూను.
నెయ్యి – కొద్దిగా.

తయారు విధానం:
పాలు, నీళ్లు రెండింటిని కలిపి మరిగించాలి. పొంగురాగానే అందులో సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. ఇప్పుడు బియ్యంపిండిలో మైదాపిండి, ఒక స్పూను పంచదార వేసి సగ్గుబియ్యం ఉడుకుతున్న పిండి కలుపుకోవాలి. ఈ పిండిని జంతికల గిద్దెతో మరుగుతున్న పాలలోకి ఒత్తాలి. లేదంటే చేత్తో పొడుగ్గా చేసి మరుగుతున్న పాలలో వేయాలి. తాలికలు పాలలోనే ఉడుకుతాయి. ఒకదాని మీద ఒకటి పడకుండా విడివిడిగా వచ్చేటట్లు నెమ్మదిగా కలుపుతుండాలి. లేదంటే ముద్దగా మారుతాయి. తాలికలు ఉడికేలోపు బెల్లం, పంచదార కలిపి పాకం పట్టి చల్లార్చుకోవాలి. తాలికలు ఉడికిన తరువాత దించేసి చల్లారిన పాకాన్ని, ఏలకుల పొడిని వేసి కలపితే పాలతాలికలు రెడీ

Latest News

More Articles