Friday, May 17, 2024

గుడ్‎న్యూస్.. SBIలో 2000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..జీతం ఎంతంటే..!!

spot_img

బ్యాంకులో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారా? అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు గుడ్ న్యూస్ అందించింది. ఈ బ్యాంకులో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టులు ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తితోపాటు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేందుకు సెప్టెంబర్ 27, 2023 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం. వీటన్నింటి గురించిన సమాచారం తెలుసుకోండి.

సంస్థ -స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
హోదా-ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)
మొత్తం పోస్టులు-2000
అర్హత-డిగ్రీ
జీతం-నెలకు ₹ 36,000-63,840
ఉద్యోగము చేయవలసిన ప్రదేశము-భారతదేశం
దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు-సెప్టెంబర్ 27, 2023

వయోపరిమితి:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థుల వయస్సు ఏప్రిల్ 1, 2024 నాటికి కనిష్టంగా 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి.

వయో సడలింపు:
SC/ST అభ్యర్థులు- 5 సంవత్సరాల
OBC (NCL) అభ్యర్థులు- 3 సంవత్సరాల
PwBD అభ్యర్థులు- 10 సంవత్సరాల
PwBD (OBC) అభ్యర్థులు- 13 సంవత్సరాల
PwBD (SC/ST) అభ్యర్థులు- 15 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము:
SC/ST/PwBD అభ్యర్థులు- దరఖాస్తు రుసుము లేదు.
జనరల్/OBC/EWS అభ్యర్థులు- 750 రూ.
చెల్లింపు విధానం – ఆన్‌లైన్

జీతం:
నెలకు ₹ 36,000-63,840

ఎంపిక ప్రక్రియ:
ప్రిలిమినరీ టెస్ట్
మెయిన్స్ టెస్ట్
సైకోమెట్రిక్ టెస్ట్
గ్రూప్ టాస్క్
ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్
అప్లికేషన్ వెరిఫికేషన్
మెడికల్ ఎగ్జామినేషన్

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 07/09/2023
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 27, 2023

 

Latest News

More Articles