Sunday, May 19, 2024

హైకోర్టు తీర్పు అమలు చేయండి.. సీఎంకి డీఎస్సీ 2008 బాధితుల విజ్ఞప్తి

spot_img

ఉద్యోగాలివ్వండి అంటూ … వినతిపత్రాన్ని సమర్పించడానికి డీఎస్సీ-2008 అభ్యర్థులంతా కలిసి ఇవాళ(సోమవారం) ఉదయం  సీఎం రేవంత్‌ రెడ్డి ఇంటికి భారీగా చేరుకున్నారు. సీఎం అందుబాటులో లేకపోవడంతో..ఆయన వ్యక్తిగత కార్యదర్శి జైపాల్ రెడ్డిని క‌లిసి వినతి పత్రం అందజేశారు.

ఆ తర్వాత మాట్లాడిన అభ్యర్థులు..తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము న్యాయం కోసం 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్నామన్నారు. 2008 డీఎస్సీలో నష్టపోయిన మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ నెల 8న రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి సూచించిందని చెప్పారు. ఈ మేరకు తమకు నియామక ప్రక్రియ జరపాలని విజ్ఞప్తి చేశారు.

ఈ అంశంపై సమగ్రంగా అధ్యయనం చేస్తామని, రెండు రోజుల్లోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక అందజేస్తామని చెప్పారు సీఎం వ్యక్తిగత కార్యదర్శి జైపాల్ రెడ్డి.

ఇది కూడా చదవండి: ఆన్‌లైన్‌లో తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ హాల్​ టికెట్స్ విడుద‌ల

Latest News

More Articles