Friday, May 17, 2024

అయోధ్యలో బాలరాముడికి ఏ రోజు రంగు దస్తులు ధరిస్తారు..!!

spot_img

అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగవైభంగా జరిగింది. ఈ శుభఘట్టాన్ని యావత్ దేశమే కాదు ప్రపంచం కూడా సంబురంగా జరుపుకుంది. రాముడుత మనతోపాటు భూలోకంలో నివసిస్తాడనేది భక్తుల నమ్మకం. బాలరాముడి అభిషేకం దేశంలో ఒక పండుగలా జరిగింది. అయితే అయోధ్య రామమందిరాన్ని ప్రతిరోజూ ఎంతో అందంగా అలంకరిస్తారు. వారం రోజులు ఒక్కో రంగు దుస్తుల్లో బాలరాముడు భక్తులకు దర్శనమిస్తారు. రాముడు ఏ రంగు దుస్తులు ధరిస్తాడు..రాముడికి ఇష్టమైన రంగు ఏంటో తెలుసుకుందాం.

1. రామ లల్లా ఈ రంగు దుస్తులను ధరించాడు:
రాముడు అయోధ్యలోని రామమందిరంలో తన సోదరులతో కలిసి కదిలే విగ్రహంలో కూర్చున్నాడు. రోజుకో రంగు దుస్తులను ధరిస్తారు. శ్రీరాముని విగ్రహం ఆవిష్కృతం కావడంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. విగ్రహంలో రాముని చూస్తే ఎవరికైనా భక్తిభావం కలుగుతుంది. ఒక్కసారి ఈ రాముని దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు.

సోమవారం – తెలుపు రంగు దుస్తులు.
మంగళవారం – ఎరుపు దుస్తులు.
బుధవారం – లేత ఆకుపచ్చ దుస్తులు.
గురువారం – పసుపు దుస్తులు.
శుక్రవారం – క్రీమ్ రంగు దుస్తులు.
శనివారం – నీలం రంగు దుస్తులు.
ఆదివారం – గులాబీ దుస్తులు.

2. అయోధ్య పూజ సమయం:
అయోధ్యలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయంలో శయన ఆరతి నిర్వహిస్తారు, ఆ తర్వాత ఆలయాల తలుపులు మూసివేస్తారు. ఇక్కడ సరయు నదికి సాయంత్రం పూట ఆరతి కూడా నిర్వహిస్తారు, వీటిని చూసేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు.

అయోధ్య రామమందిరంలో, రాముడి ప్రాణప్రతిష్ట రోజున పసుపు బట్టలు ధరించి పూజించారు. దేశం నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు అయోధ్యకు తరలివచ్చారు. అయోధ్య రాముడి పట్టాభిషేకాన్ని కనులారా తిలకించారు.

ఇది కూడా చదవండి: ఆకాశంలో ఇండిగో విమానం ఇంజిన్ ఫెయిల్..ఫ్లైట్ లో 160 మంది ప్రయాణికులు..!!

Latest News

More Articles