Saturday, May 18, 2024

ఏషియన్ గేమ్స్‎లో గత రికార్డును బద్దలుకొట్టిన భారత్

spot_img

చైనా వేదికగా జరుగుతోన్న ఏషియన్ గేమ్స్ 2023లో భార‌త క్రీడాకారులు అసాధార‌ణ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రుస్తున్నారు. ఏషియన్ గేమ్స్‎లో మ‌న అథ్లెట్లు స‌రికొత్త రికార్డ్ సృష్టించారు. ఆర్చ‌రీ మిక్స్‌డ్ ఈవెంట్‌లో ఇండియా త‌న ఖాతాలో ఓ గోల్డ్ మెడ‌ల్ వేసుకున్న‌ది. ఈ ఎడిషన్‌లో ఆర్చరీలో భారతదేశానికి ఇదే మొదటి స్వర్ణం కావడం విశేషం. దాంతో ఇండియా సాధించిన మెడ‌ల్స్ ట్యాలీ పెరిగిపోయింది. హాంగ్‌జౌలో జ‌రుగుతున్న ఈ గేమ్స్‌లో భారత్ ఇప్ప‌టి వ‌ర‌కు 71 ప‌త‌కాల‌ను కైవ‌సం చేసుకున్నది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఆసియా క్రీడ‌ల్లో ఇండియాకు అత్య‌ధిక సంఖ్య‌లో ప‌త‌కాలు రావ‌డం ఇదే మొద‌టిసారి కావడం గమనార్హం. జ‌క‌ర్తాలో 2018లో జ‌రిగిన ఆసియా క్రీడ‌ల్లో భార‌త్ అత్య‌ధికంగా 70 ప‌త‌కాల‌ను గెలుచుకున్న‌ది. ఆ ఏడాది 16 స్వ‌ర్ణాలు, 23 సిల్వ‌ర్, 31 కాంస్య ప‌త‌కాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న‌ది. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయింది. ఈసారి ఇప్ప‌టికే 16 గోల్డ్‌, 26 సిల్వ‌ర్, 29 కాంస్య ప‌త‌కాల‌ను ఇండియా గెలుచుకున్న సాధించింది. 2023లో వంద పతకాలే లక్ష్యంగా భారత అథ్లెట్లు బరిలోకి దిగారు. అయితే ఇంకా ఈవెంట్స్‌ ఉన్న నేపథ్యంలో ఆ మార్క్ సాధించే అవకాశం లేకపోలేదు.

Read Also: బీజేపీ లక్ష్మణ్ వచ్చి బీఆర్ఎస్‎కు మద్దతిస్తామన్నారు.. మేమే తిరస్కరించాం

Latest News

More Articles