Sunday, May 19, 2024

71వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం..!!

spot_img

71వ మిస్ వరల్డ్ పోటీకి భారతదేశం పూర్తిగా సిద్ధమైంది. రాజధాని ఢిల్లీ, ముంబై ప్రధాన కేంద్రాలుగా ఈ పోటీలు జరగనున్నాయి. 71వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ 18 ఫిబ్రవరి 2024 నుండి ప్రారంభమై 9 మార్చి 2024 వరకు కొనసాగుతుంది. ఇందులో దేశంలోని, ప్రపంచంలోని వర్ధమాన అందాల తారలందరూ పాల్గొంటారు. ఈ క్రమంలో రాజధాని ఢిల్లీలో అర్థరాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో భారత్‌కు వచ్చిన ఐదుగురు మిస్ వరల్డ్ విజేతలు పాల్గొన్నారు.

71వ మిస్ వరల్డ్ పోటీల కోసం తొలిసారిగా ఐదుగురు మిస్ వరల్డ్ విజేతలు భారతదేశానికి చేరుకున్నారు. ఐదుగురు ప్రపంచ సుందరి విజేతలలో స్టెఫానీ డెల్ వల్లే (66వ ప్రపంచ సుందరి), మానుషి చిల్లర్ (67వ ప్రపంచ సుందరి), వెనెస్సా పోన్స్ డి లియోన్ (68వ ప్రపంచ సుందరి), టోనీ-ఆన్ సింగ్ (69వ ప్రపంచ సుందరి)తో పాటు ప్రస్తుత ప్రపంచ సుందరి కరోలినా బియావాస్కా ( ప్రపంచ సుందరి) ఉన్నారు.

1951లో తొలిసారి అందాల పోటీలు:
అందంతోపాటు సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పును తీసుకురావడం, తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు ఉన్నవారిని గుర్తించి సత్కరించడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశం. సంప్రదాయ అందాల పోటీలను మిస్‌ వరల్డ్‌ పోటీలను 1951లో తొలిసారి నిర్వహించారు. అయితే 15 ఏళ్ల తర్వాత భారత్ కు చెందిన రీటా ఫారియా తొలిసారి విజేతగా నిలిచింది. 1966లో భారత్‌కు చెందిన రీటా ఫారియా ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. మళ్లీ 28 ఏళ్ల తర్వాత అంటే… 1994లో ఐశ్వర్యరాయ్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 1997లో డయానా హేడెన్‌, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరి కిరిటాన్ని కైవసం చేసుకున్నారు. 1990 నుంచి 2000 సంవత్సరాల మధ్య నలుగురు భారతీయులు మొదటి స్థానంలో నిలువగా.. చివరి 2017లో మానుషి చిల్లర్‌ మిస్‌ వరల్డ్‌గా ఎంపికయ్యారు. గతేడాది జరిగిన పోటీల్లో పొలండ్ కు చెందిన కరోలినా బిలాస్కా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: నేటి నుంచి మాఘమాసం..పెళ్లిళ్లకు ఇవే మంచి ముహుర్తాలు..!!

Latest News

More Articles