Saturday, May 18, 2024

లండన్‎లో వాకింగ్‎కు వెళ్లిన తెలుగు విద్యార్థి మృతి

spot_img

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన లండన్‎లో వెలుగుచూసింది. గత నెలలో వాకింగ్‎కు వెళ్లిన మిత్ కుమార్.. కనిపించకుండా పోయాడు. తాజాగా ఆయన శవం ఓ నదిలో కనిపించింది.

Read also: 70 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన మహిళ

ఉన్నత చదువుల కోసం మిత్‌కుమార్ సెప్టెంబర్‌లో యూకే వెళ్లాడు. నవంబర్‌ 20వ తేదీ నుంచి షెఫీల్డ్‌ హాలమ్‌ వర్సిటీలో డిగ్రీ కోర్సు ప్రారంభించాల్సి ఉంది. అమెజాన్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ కూడా సంపాదించాడు. అయితే, నవంబర్ 17న డైలీ వాక్‌కు అని వెళ్లిన మిత్‌ కుమార్‌ తిరిగి ఇంటికి రాలేదు. బంధువుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నవంబర్‌ 21వ తేదీన తూర్పు లండన్‌లోని కానరీ వార్ఫ్ ప్రాంతానికి సమీపంలోని థేమ్స్ నదిలో అతడి మృతదేహాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు గుర్తించారు. అతడి మరణానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. మిత్ కుమార్ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు కావడంతో.. అతని తల్లిదండ్రులకు ఆర్థికసాయం చేయాలని స్నేహితులు భావించారు. అందులో భాగంగా ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా చేపట్టారు. త్వరలోనే మిత్ కుమార్ మృతదేహాన్ని స్వస్థలానికి పంపిస్తామని స్నేహితులు తెలిపారు.

Latest News

More Articles