Saturday, May 18, 2024

తెలంగాణలో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు..!!

spot_img

తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశంలో డిప్యూటీ సీఎం తోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల అభివ్రుద్ధి కార్యాచరణపై చర్చించిన అనంతరం డిప్యూటీ సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక నుంచి పాలకమండలి సమావేశాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని చెప్పారు.

భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం సాక్షిగా మహిళలకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని చెబుతున్నామన్నారు. ఆశా వర్కర్ల కు కూడా వారికి జీతాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇది కూడా చదవండి: రాహుల్ కు షాకిచ్చిన అఖిలేష్..లెక్కతేలాల్సిందే అంటూ..!!

 

Latest News

More Articles