Tuesday, May 21, 2024

వచ్చే నెల 19న ఐపీఎల్‌ మినీ వేలం.. ముంబైకు హార్దిక్‌ పాండ్య 

spot_img

ముంబయి : వచ్చే నెల 19న ఐపీఎల్‌ మినీ వేలం నిర్వహించనున్నారు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఐపీఎల్‌లో తిరిగి ముంబయి ఇండియన్స్‌ గూటికే చేరాడు. గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ను ఫైనల్స్‌ చేర్చడమే కాక, 2022లో విజేతగా కూడా నిలిపాడు. వచ్చే సీజన్‌ నుంచి తిరిగి ముంబయికి ఆడబోతున్నాడు. హార్దిక్‌కు ముంబయి ఏడాదికి రూ.15 కోట్లు చెల్లించనుంది. అదేసమయంలో రూ.17.5 కోట్లు చెల్లించి తీసుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ను బెంగళూరుకు ఇచ్చేసింది.  అలాగే ఆర్చర్‌, మెరెడిత్‌,  రిచర్డ్‌సన్‌, జోర్డాన్‌ తదితర ఆటగాళ్లను ముంబయి వదులుకుంది.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు హసరంగ, హర్షల్‌ పటేల్‌, హేజిల్‌వుడ్‌, విల్లీ, పార్నెల్‌ లాంటి బౌలర్లను వదులుకుంది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ సహా అంబటి రాయుడు (ఐపీఎల్‌ రిటైర్మెంట్‌), ప్రిటోరియస్‌, జేమీసన్‌ తదితర ఆటగాళ్లను చెన్నై విడుదల చేసింది. రూట్‌, హోల్డర్‌ను రాజస్థాన్‌ విడిచిపెట్టింది. ఫినిషర్‌ షారుక్‌ ఖాన్‌ను పంజాబ్‌ వదులుకుంది. కోల్‌కతా శార్దూల్‌, ఫెర్గూసన్‌, సౌథీ, ఉమేశ్‌ యాదవ్‌, షకిబుల్‌ హసన్‌ తదితర ఆటగాళ్లను రిలీజ్ చేసింది. పది జట్లు కలిపి మొత్తం 87 మంది ఆటగాళ్లను వదులుకున్నాయి. అత్యధికంగా ముంబయి 12 మందిని, అత్యల్పంగా పంజాబ్‌ 5 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసాయి.

Latest News

More Articles