Monday, May 20, 2024

‘విక్రమ్‌ ల్యాండర్’పై ఇస్రో తాజా అప్‌డేట్‌..!

spot_img

Chandrayaan-3: చంద్రయాన్‌-3 కు సంబంధించిన తాజా సమాచారాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) షేర్ చేసింది. ప్రస్తుతం స్లీప్‌ మోడ్‌లో ఉన్న విక్రమ్‌ ల్యాండర్‌ ఫొటోను రిలీజ్‌ చేసింది.

చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ ఎపర్చర్‌ రాడార్ (DFSAR) ద్వారా చంద్రయాన్‌-3 ల్యాండర్‌ ఫొటోను తీసినట్లు తన పోస్ట్ లో ఇస్రో తెలిపింది. ఈ నెల 6న ఈ ఫొటోను తీసినట్లు పేర్కొంది.

Also Read.. బాక్సాఫీస్‌ వద్ద ‘జవాన్‌’ బీభత్సం..!!

చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా విక్రమ్‌ ల్యాండర్‌ ఆగస్ట్‌ 23న చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ల్యాండ్‌ అయ్యింది. చంద్రుడిపై లూనార్‌ నైట్‌  ప్రారంభం కావడంతో విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ను స్లీప్‌ మోడ్‌లో పెట్టింది.

ఇదిలా ఉండగా.. ఈ నెల 22న చంద్రుడిపై తిరిగి లూనార్‌ డే ప్రారంభం కానుంది.  అయితే, లూనార్‌ నైట్‌ సమయంలో చంద్రుడి ఉపరితలంపై ఉండే మైనస్‌ 200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వంటి పరిస్థితులను ల్యాండర్‌, రోవర్‌ తట్టుకుని తిరిగి అవి పనిచేస్తాయా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.

Latest News

More Articles