Sunday, May 19, 2024

కొమురెల్లి మల్లన్నకు ఐటీ నోటీసులు.. ఇన్‌కం ట్యాక్స్‌ కట్టలేదని రూ. 3 కోట్ల ఫైన్

spot_img

తాము గొప్ప హిందువులమని చెప్పుకునే బీజేపీ నేతల తీరు తేటతెల్లమైంది. దేవుడి మీద నమ్మకంతో భక్తులు తమకు నచ్చిన దేవుడిని దర్శించుకొని, కానుకలను హుండీలో వేస్తుంటారు. అలా ఆ గుడికి వచ్చిన ఆదాయంపై ట్యాక్స్ కట్టలేదని ఏకంగా దేవుడికే ఫైన్ వేశారు. తాజాగా తెలంగాణలోని పలు ప్రముఖ దేవాలయాలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి రూ.8 కోట్ల ఇన్‌కం ట్యాక్స్‌ కట్టాలంటూ నోటీసులు వచ్చాయని ఆలయ అధికారులు వెల్లడించారు. సకాలంలో పన్ను కట్టనందున మరో రూ.3 కోట్ల జరిమానా కూడా కట్టాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారని తెలిపారు. కొమురవెల్లి మల్లన్నకే కాకుండా, బాసరలోని సరస్వతి ఆలయం, వేములవాడ రాజన్న సహా ఇంకా పలు దేవాలయాలకు ఇప్పటికే ఐటీ నోటీసులు వచ్చినట్టు చెప్తున్నారు.

Read Also: బీజేపీ లక్ష్మణ్ వచ్చి బీఆర్ఎస్‎కు మద్దతిస్తామన్నారు.. మేమే తిరస్కరించాం

గుళ్లు, దేవాలయాలు, హిందుత్వం అంటూ మతం గురించి మాట్లాడే బీజేపీ ఒకవైపు ప్రేమ ఒలకబోస్తూనే.. మరో వైపు ఇలా నోటీసులు ఇవ్వడం కేంద్రంలోని ఒక్క బీజేపీ సర్కారుకే చెల్లింది. బీజేపీ తన చేతిలోని ఐటీ శాఖను ప్రత్యర్ధి పార్టీలపై ఎక్కుపెట్టడానికే కాదు.. గుళ్లకు చెందిన ఆస్తులపై గురిపెట్టేందుకు కూడా ఉపయోగిస్తుందన్నది పచ్చినిజమని మరోసారి బట్టబయలైంది. వేల కోట్ల రూపాయలు దోచుకొని.. పన్నులు ఎగ్గొట్టే వ్యాపారులను వదిలిపెట్టి ఆధ్యాత్మిక కేంద్రాలకు పన్ను కట్టాలని నోటీసులు ఇవ్వడం మోడీ సర్కారుకే చెల్లిందని భక్తులు మండిపడుతున్నారు.

కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయంపై పన్ను కట్టాలని ఆదేశించారు. ఐటీ చట్టం 147 కింద రూ.8,64,49,041 పన్ను చెల్లించాల్సి ఉందని, దీన్ని సకాలంలో చెల్లించనందుకు సెక్షన్‌ 271 (1) సీ ప్రకారం రూ.3,49,71,341, సెక్షన్‌ 271(1) డీ ప్రకారం మరో రూ.20వేలు, ఐటీ చట్టం 271 (ఎఫ్‌) కింద మరో రూ.5 వేలు జరిమానాలుగా చెల్లించాలని, మొత్తంగా రూ.12 కోట్లకుపైగా సొమ్మును తక్షణం చెల్లించాలని హైదరాబాద్‌ సర్కిల్‌ ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది.

Latest News

More Articles