Saturday, May 18, 2024

అవినీతి అధికారిని జగజ్యోతిని చంచ‌ల్ గూడ జైలుకు త‌ర‌లింపు

spot_img

లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ జగజ్యోతిని నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు హాజరు పర్చారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్‌ విధించారు.  ఆ తర్వాత ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

గ‌త వారం జగజ్యోతి నివాసంలో సోదాలు చేసిన అధికారులు రూ.65,50,000 నగదు, రూ.1,51,08,175 విలువైన 3.639 కిలోల బంగారం, ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. భూముల విలువ అంచనా వేయాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమెకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆస్తుల విలువ రూ.50 కోట్ల‌కు పైగా ఉండ‌వ‌చ్చ‌ని అంచనావేస్తున్నారు.

ఇది కూడా చదవండి:జాతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కోసం ప్రయత్నిస్తున్నాయి

Latest News

More Articles