Sunday, May 19, 2024

జార్ఖండ్ కొత్త సీఎం చంపై సోరెన్..? ఎప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారో తెలుసా?

spot_img

జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ నియామకం దాదాపు ఖరారు అయ్యింది. ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా చంపై సొరెన్ ను సీఎంగా ఎన్నికుంది. చంపై సోరెన్ హేమంత్ సోరెన్ కు దగ్గరి బంధువు. ప్రస్తుతం ఆయన మంత్రివర్గంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేఎంఎంతోపాటు కాంగ్రెస్ కూడా మిత్రపక్షంగా కొసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఎవరూ ఊహించన విధంగా చంపై సోరెన్ పేరు తెరపైకి వచ్చింది. కాగా నేడు చంపై సోరెన్ జార్ఖండ్ సీఎం పగ్గాలు తీసుకోనున్నారు.

చంపై సోరెన్ జార్ఖండ్ టైగార్ మంచి పేరుంది:
చంపై సోరెన్ జిల్లింగగోడ గ్రామంలోని గిరిజన నివాసి సిమల్ సోరెన్ నలుగురు పిల్లలలో ఒకరు. సిమల్ సోరెన్ పెద్ద కొడుకు చంపై సోరెన్. చంపై సోరెన్ కూడా తన తండ్రితోపాటు వ్యవసాయం చేశాడు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. చిన్నవయస్సులోచంపై సోరెన్ వివాహం చేశారు. వారికి నలుగురు కొడుకులు, ముగ్గురు కూతురులు ఉన్నారు. బీహార్ నుండి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రాన్ని కోరుతూ జరిగిన ఉద్యమంలో శిబు సోరెన్‌తో కలిసి చంపై పాల్గొని ‘జార్ఖండ్ టైగర్’గా ఫేమస్ అయ్యారు. చంపై సోరెన్ తన రాజకీయ జీవితాన్ని సెరైకెలా స్థానం నుండి ఉప ఎన్నికలో స్వతంత్ర ఎమ్మెల్యేగా చేసి, ఆ తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చాలో చేరారు.

ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో ఘోరరోడ్డు ప్రమాదం, నలుగురు మృతి.. 10మందికి గాయాలు..!!

Latest News

More Articles