Friday, June 28, 2024

2028లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది

spot_img

2028లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి.అమలు కానీ హామీలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తోందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కడియం మాట్లాడారు. ఇప్పటికే 17 పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలు తెలంగాణ భవనంలోనిర్వహించుకున్నాము.కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు కావలసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేపట్టాము. ప్రతి ఒక్కరి సూచనలు సలహాలు తీసుకొని కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తాము. రాజకీయాల్లో గెలుపు,ఓటములు సహజం. వందకు వంద శాతం ప్రజల్లో కేసీఆర్ అభివృద్ధి పథకాలు ప్రజల మనసుల్లో మెదులుతున్నాయన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి వచ్చింది లంకె బిందెల కోసమేనా అని ప్రశ్నించారు కడియం శ్రీహరి. ప్రజలకు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రజలకు ఇప్పటికి వరకు రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదన్నారు.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయం మరచి మాట్లాడుతున్నారు..ఇంకా ప్రతి ప్రతిపక్ష నాయకుడులానే మాట్లాడుతూన్నాడని ఆరోపించారు. బీఆర్ ఎస్ ను ఇంతవరకు బొంద పెట్టె నాయకుడు పుట్టలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ  420 హామీలు అమలు చేయకపోతే 100 రోజుల తర్వాత ప్రశ్నించి తీరుతామన్నారు.రేపటి లోక్ సభ ఎన్నికల్లో పార్టీని మరింత పటిష్టం చేయాలని బీర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కృషి చేయాలని కోరారు కడియం.

ఇది కూడా చదవండి:కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు

Latest News

More Articles