Saturday, May 4, 2024

ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

spot_img

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో నూతన సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.

గతాన్ని సమీక్షించుకుని బంగారు భవిష్యత్తు నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి ఇంటా సంతోషాలు వెల్లి విరియాలని, ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత నూతన లక్ష్యాలు నిర్దేశించుకుని, వాటిని సాధించేలా ప్రణాళికతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Latest News

More Articles