Sunday, May 19, 2024

కేజ్రీవాల్ ను పది రోజుల కస్టడీ కోరే అవకాశం..!

spot_img

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాత్రంతా లాకప్ లోనే గడిపినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అనంతరం ఆయనకు రామ్ మనోహర్ లోహియా వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం దేశ రాజధానిలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. అయితే కేజ్రీవాల్ ను రాత్రంతా ఈడీ ఆఫీసులోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న లాకప్ లో ఉంచినట్లు తెలిసింది. రాత్రి కేజ్రీవాల్ ను అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేయలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రాత్రంతా కేజ్రీవాల్ సరిగ్గా నిద్రపోలేదని..తెల్లవారుజామునే నిద్రలేచి అల్పాహారం, మందులు తీసుకున్నట్లు తెలిపారు.

కాసేపట్లో కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా విచారణ కోసం కేజ్రీవాల్ పదిరోజులపాటు కస్టడీకి కోరనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండా..అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేజ్రీ తరపున లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై నేడు అత్యవసర విచారణ చేపట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరో వైపు అరవింద్ కేజ్రీవాల్ భద్రతపై ఢిల్లీ ప్రభుత్వ మంత్రి అతిషి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ రాశారు. దేశంలోనే తొలిసారిగా సిట్టింగ్‌ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ కావడంపై ఆయన తన పోస్ట్‌లో రాశారు. వారికి Z+ సెక్యూరిటీ కవర్ ఉంది. ఇప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వ ఈడీ కస్టడీలో ఉన్నారు. మేము వారి భద్రత గురించి ఆందోళన చెందుతున్నాము అని పోస్టు చేశారు

అంతకుముందు ‘ఢిల్లీ సీఎం అరెస్టును రద్దు చేయాలని మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాము. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడంపై తక్షణమే సుప్రీంకోర్టు విచారణ జరపాలని డిమాండ్ చేశాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ గురించి ఇంతకుముందు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నుండి ఈడీ బృందానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇది అప్రజాస్వామికమని, ఎన్నికల ముందు ఇలా చేస్తున్నారని, ఢిల్లీ ప్రజలు మౌనంగా ఉండరు అని ఆరోపించారు.

ఇది కూడా చదవండి : ఐపీఎల్‌లో ధోనీ పేరిట ఓ ప్రత్యేక రికార్డు..ఆ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్..!

Latest News

More Articles