Saturday, May 4, 2024

మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెప్పాలి

spot_img

మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి అవకాశం కల్పించిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసం దగ్గర మంచిర్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొని మాట్లాడారు కొప్పుల ఈశ్వర్.. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పరిశ్రమలు,సింగరేణి బొగ్గు గనులు,థర్మల్ విద్యుత్ కేంద్రాలు,బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కార్మికుల సమస్యల పరిష్కారం కొసం అనేక ఉద్యమాలు చేసిన నాపై నమ్మకం ఉంచి నా అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేసారు. మాజీ సీఎం కేసీఆర్ విజన్ వల్లనే దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేశారన్నారు.

వంద రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా 6 హామీలను అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు కొప్పుల ఈశ్వర్. తాగు,సాగునీరు,విద్యుత్ కోతలతో రాష్ట్రంలో వ్యవసాయరంగం సంక్షోబంలో పడిందన్నారు. సింగరేణి కార్మికుడిగా,ఆరు సార్లు ఎమ్మేల్యే గా,మంత్రి గా పని చేసిన అనుభవం ఉన్న కారణంగా నాకు టికెట్ వచ్చిందన్నారు. సింగరేణిలో వేజ్‌బోర్డు సమస్యల మీద,గని కార్మికుల సమస్యల మీద అనేక పోరాటాలు చేశానన్నారు. మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్స్ పార్టికి ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలన్నారు కొప్పుల. నన్ను ఆదరించి బీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల పక్షాన పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: రేవంత్.. సమర్థుడివైతే కొత్తగా ఉద్యోగాలు సృష్టించు

 

 

Latest News

More Articles