Monday, May 20, 2024

కేఆర్‌ఎంబీ చేతికి నాగార్జున సాగర్‌ ప్రాజక్టు నిర్వాహణ!

spot_img

హైదరాబాద్:  నాగార్జున సాగర్‌ ప్రాజక్టు భద్రత సహా కార్యకలాపాలను కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) కి అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇటీవల సాగర్‌ ప్రాజక్టు వద్ద చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో బుధవారం ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమీక్ష నిర్వహించారు.

Also Read.. సైన్స్ ఫిక్షన్ ‘అయలాన్‌’ సెన్సేషన్..!

శ్రీశైలం ప్రాజక్టు నిర్వహణ అంతా ఏపీ ప్రభుత్వం చేతుల్లో ఉందని సమీక్షలో జలశక్తి శాఖ కార్యదర్శి దృష్టికి తెలంగాణ అధికారులు తీసుకువచ్చారు. సాగర్‌ నిర్వహణ అంతా… కేఆర్‌ఎంబీకి అప్పగించే విషయంపై తమ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం చెబుతాం అని ఇరు రాష్ట్రాల అధికారులు స్పష్టం చేశారు.

Also Read.. దొంగ హామీలు ఇచ్చి.. తెలంగాణని కాంగ్రెస్ మోసం చేస్తుంది

విద్యుత్‌ ప్రాజక్టులు సహా ప్రాజక్టు పరిధిలో ఉన్న అవుట్‌లెట్స్‌, సాంకేతిక పరిమితులు వంటి విషయాలపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న ఇరు రాష్ట్రాల అధికారులు అభిప్రాయపడ్డారు. అవుట్‌లెట్స్‌ ఏవీ ఎవరి పరిధిలో ఉండాలో కూడా తేలాల్సి ఉందన్నారు. సాంకేతిక అంశాలపై ఇరు రాష్ట్రాల సీఈలు కూర్చుని ఒక నిర్ణయానికి రావాలని జలశక్తి శాఖ కార్యదర్శి సూచించారు.

Also Read.. కెనడాకు షాక్. 86 శాతం తగ్గిన ఇండియన్ స్టూడెంట్స్!

కాగా, ప్రస్తుతం సిఆర్‌పిఎఫ్ పెట్రోలింగ్‌ ను యధాతథంగా ఉంచాలని ఇరు రాష్ట్రాలు, జలశక్తి శాఖ అధికారులు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. సాంకేతిక అంశాలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయతో నివేదిక పంపిన తర్వాత మరోసారి భేటీ ఉంటుందని జలశక్తి శాఖ కార్యదర్శి చెప్పినట్లు అధికారులు వెల్లడించారు.

Latest News

More Articles