Tuesday, May 14, 2024

రేవంత్‌ రెడ్డి ఎన్నికలకు ముందు ఏం చెప్పారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?

spot_img

సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పిందొకటి ఇప్పుడు చేస్తున్నదొకటని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దని ప్రకటించారని, డిసెంబర్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే డిసెంబర్‌ 9న రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారని, ఇప్పటివరకు లోన్‌ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి.. తీసుకున్నోళ్లకు తమ ప్రభుత్వం రుణమాపీ చేశాక బ్యాంకోళ్లు మళ్లీ లోన్లు ఇస్తరు అని ప్రకటించారని చెప్పారు.

ఇది కూడా చదవండి: యూట్యూబ్‌ ఛానళ్లపై కేటీఆర్‌ సీరియస్‌

అధికారంలోకి వచ్చి వంద రోజులు గడుస్తున్నా.. పంట రుణాలపై కాంగ్రెస్‌  ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో రైతన్నలకు బ్యాంకుల అధికారులు లీగల్‌ నోటీసులు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత మోసం, పచ్చి దగా, నయవంచన అంటూ ఎక్స్‌ మేదికగా ట్వీట్‌ చేశారు కేటీఆర్.

 

Latest News

More Articles