Sunday, May 19, 2024

పెట్టుబడిదారులకు తెలంగాణ స్వ‌ర్గ‌ధామం

spot_img

హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. న్యూయార్క్‌లో జ‌రిగిన ఇన్వెస్ట‌ర్ రౌండ్‌టేబుల్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించారు.  ఇండియాలో పెట్టుబడులు పెట్టే ల‌క్ష్యంతో ఉన్న కంపెనీలకు తెలంగాణ స్వ‌ర్గ‌ధామంగా నిలుస్తుంద‌ని మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి వ్యాపారాన్ని అయిన మొద‌లుపెట్టేందుకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ‌న‌రులు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ఇన్నోవేష‌న్ వ్య‌వ‌స్థ‌ను ఉత్తేజ ప‌రిచే విధంగా తెలంగాణ పారిశ్రామిక విధానాలు ఉన్న‌ట్లు మంత్రి  కేటీఆర్ పేర్కొన్నారు. మొత్తం 14 రంగాల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని, ఆ రంగాల‌కు విస్తృత రీతిలో అవ‌కాశాల‌ను కూడా క‌ల్పిస్తున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు.

కౌన్సులేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా, యూఎస్ ఇండియా స్ట్రాట‌జిక్ పార్ట్న‌ర్‌షిప్ ఫోర‌మ్ సంయుక్తంగా ఈ స‌మావేశాన్ని నిర్వ‌హించాయి. న్యూయార్క్ సిటీతో త‌న‌కు ఉన్న లోతైన అనుబంధాన్నికేటీఆర్ మరోసారి గుర్తుచేసుకున్నారు. న్యూయార్క్ సిటీలోనే తాను చ‌దువుకుని, ఉద్యోగం చేసినట్లు ఈ సందర్భంగా కేటీఆర్ ఆహుతులకు తెలిపారు.

Latest News

More Articles