Saturday, May 18, 2024

రేవంత్ నీకు కౌంట్‌డౌన్ మొదలైంది.. కేటీఆర్ ఫైర్

spot_img

కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. రేవంత్ రెడ్డి సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ప్రజల దగ్గరకు తీసుకెళ్తామని తెలిపారు. ఎన్నికల హామీలను ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. అబద్దాలు, అసత్యాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ సర్కార్ దిగజారుడు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ హెచ్చరించారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును బద్నాం చేసేలా కాంగ్రెస్, బీజేపీ వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో దివాళా తీసిన కాంగ్రెస్ పార్టీ.. పొరపాటున అధికారం దక్కించుకుని రాష్ట్రం దివాలా తీసిందని అంటున్నారని విమర్శించారు. రేవంత్ సర్కార్ కు 100 రోజుల కౌంట్ డౌన్ మొదలైందన్న కేటీఆర్.. వంద రోజుల్లో హామీలు అమలు చేయకపోతే బొంద పెట్టేలా మా కార్యాచరణ అమలు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందే ఎన్నికల హామీలను నెరవేర్చాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేటీఆర్.

Latest News

More Articles